బ్రెయిలీ లిపిలో సీఎం కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర.. ఆవిష్కరించిన కేటీఆర్
Brief Biography of CM KCR in Braille.సీఎం కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్రను బ్రెయిలీ లిపిలో ముద్రించారు
By తోట వంశీ కుమార్ Published on 16 Feb 2023 6:45 PM ISTసీఎం కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్రను బ్రెయిలీ లిపిలో ముద్రించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కేసీఆర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, విద్యార్థి రాజకీయ జీవితం, రాజకీయం లో అనుభవించిన పదవులు, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ముఖ్యమంత్రి గా కేసీఆర్ పాలన, తెలంగాణ లో అమలవుతున్న పథకాలను పుస్తకంలో పొందుపరిచినట్టు రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్వా సుదేవరెడ్డి మంత్రి కేటీఆర్ కి వివరించారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన కేసీఆర్ గారి సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీ @KTRBRS. pic.twitter.com/tBP7SCKhjw
— BRS Party (@BRSparty) February 16, 2023
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోని గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఆయన చరిత్ర భావి తరాల వారికి తెలవాల్సిన అవసరం ఉందన్నారు. అంధులకు కూడా కేసీఆర్ చరిత్ర తెలిసే విధంగా బ్రెయిలీ లిపిలో పుస్తకాన్ని వాసుదేవరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ముద్రించడం అభినందనీయమని కొనియాడారు.
అనంతరం అంధ విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి, చైర్మన్స్ బాలమల్లు,వేణుగోపాల చారీ, సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సిలు కర్నె ప్రభాకర్,పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.