ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం.. ఫ్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో వరుడు మృతి

Bridegroom dies during pre-wedding ceremony in Adilabad. మరికొన్ని గంటల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే విధి వెక్కిరించిందో..

By అంజి  Published on  27 Jan 2023 10:30 AM IST
ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం.. ఫ్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో వరుడు మృతి

మరికొన్ని గంటల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే విధి వెక్కిరించిందో.. ఏమో ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అప్పటిదాకా పెళ్లి సందడితో ఎంతో ఉత్సాహంగా ఉన్న కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో పెళ్లికి ముందు జరిగిన వేడుకల్లో వరుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఉట్నూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ వేడుకలో రావుల శంకరయ్య - భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణ చారి గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

వెంటనే అతడిని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణను ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఓ యువతితో సత్యనారాయణ వివాహం శుక్రవారం జరగాల్సి ఉంది. మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందన్న సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన వరుడు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా కప్పకూలిపోయాడు.

Next Story