రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు, స్పాట్‌లో కుక్క మృతి..తప్పిన భారీ ప్రమాదం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది

By -  Knakam Karthik
Published on : 3 Dec 2025 4:53 PM IST

Telangana,  Bhadradri Kothagudem district, Bomb scare

రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు, స్పాట్‌లో కుక్క మృతి..తప్పిన భారీ ప్రమాదం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు. దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటన కుక్క స్పాట్‌లో మృతి చెందింది.

రైల్వేస్టేషన్ లో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రైల్వేస్టేషన్ పరిసరాల్లో డాగ్స్ స్క్వాడ్ తో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వేటగాళ్లు అమర్చే నాటు బాంబులా.. మరేదైనా విస్పోటనానికి స్పందించిన కుట్ర దాగి ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన రైల్వే అధికారులతో పాటు పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది.

బ్యాగులో ఐదు పేలని బాంబులను పోలీసులు కనుగొన్నారు. తెల్లవారుజామున స్టేషన్ నుండి బయలుదేరే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో ఎవరో బాంబులు తీసుకెళ్లడానికి ప్రయత్నించారని, పోలీసుల తనిఖీలకు భయపడి బ్యాగును పట్టాలపై వదిలివేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Next Story