కేసీఆర్ కుటుంబంలోనే లీకు వీరులు, లిక్కర్ వీరులు: బండి సంజయ్‌

కరీంనగర్‌: ఎస్‌ఎస్‌సీ హిందీ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

By అంజి  Published on  7 April 2023 5:54 AM GMT
BJP state president ,Bandi Sanjay, Karimnagar Jail

కేసీఆర్ కుటుంబంలోనే లీకు వీరులు, లిక్కర్ వీరులు: బండి సంజయ్‌

కరీంనగర్‌: ఎస్‌ఎస్‌సీ హిందీ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ శుక్రవారం ఉదయం కరీంనగర్‌ జిల్లా జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. హన్మకొండ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం రాత్రి షరతులతో కూడిన బెయిల్‌ను అనుమతించడంతో ఇది జరిగింది. జైలు వెలుపల మీడియాతో మాట్లాడిన సంజయ్ కుమార్.. పోలీసులు తనపై తప్పుడు ఆధారాలతో కేసు నమోదు చేశారని, పేపర్ లీకేజీ ఎపిసోడ్‌పై సిట్టింగ్ జడ్జితో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్, వరంగల్ పోలీస్ కమీషనర్లపై లోక్‌సభ స్పీకర్‌తో ప్రివిలేజ్ కేసు నమోదు చేస్తానని చెప్పారు. తన ఇంటిపై పోలీసులు దాడి చేసి వారెంట్ లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తన మొబైల్ ఫోన్‌ను పోలీసులకు ఇవ్వడానికి నిరాకరించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఫోన్ పోలీసుల వద్ద ఉందని పేర్కొన్నాడు. అలాగే ఈ కేసులో వరంగల్‌ సీపీ రంగనాథ్ చెప్పిన విషయాలు నిజమేనా? పోలీస్ టోపీపై ఉన్న మూడు సింహాలపై ఆయన ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. లీకేజీ విషయంలో తనకు సంబంధం లేదని తాను ప్రమాణం చేస్తానన్నారు.

పేపర్ లీక్‌కి, మాల్ ప్రాక్టీస్‌కి తేడా తెలియదా? అంటూ వరంగల్‌ సీపీని బండి సంజయ్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుటుంబంలోనే లీకు వీరులు, లిక్కర్ వీరులు ఉన్నారని ఆరోపించారు. తమకు జైలు, లాఠీ దెబ్బలు కొత్త కాదన్న బండి సంజయ్‌.. రేపటి మోదీ సభతో బీజేపీ బలాన్ని నిరూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Next Story