రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం వేళ రాజాసింగ్ సంచలన కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.
By Srikanth Gundamalla Published on 6 Dec 2023 1:38 PM ISTరేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం వేళ రాజాసింగ్ సంచలన కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు సీఎం ఎవరన్న ఉత్కంఠకు కూడా ఏఐసీసీ తెరదించిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డినే సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ చేశారు. ఎల్బీ స్టేడియంలో రేపు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకుగాను ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. సీఎస్‌తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు.
తెలంగాణలో సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఏడాది తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని జోస్యం చెప్పారు. దాంతో.. రాజాసింగ్ వ్యాఖ్య చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని రాజాసింగ్ అన్నారు. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాం్గరెస్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనా రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్‌నే తెలంగాణ ప్రజలు మార్చేశారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో ఒకే స్థానంలో గెలవగా.. ఈ సారి బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది.