తెలంగాణకు రానున్న జేపీ నడ్డా, అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న
By M.S.R Published on 18 May 2023 5:30 PM ISTతెలంగాణకు రానున్న జేపీ నడ్డా, అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా తెలంగాణలో నిర్వహించే రెండు బహిరంగ సభల్లో బీజేపీ బడా నేతలు పాల్గొంటారు. నెల రోజుల పాటు మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహించేందుకు బీజేపీ నిర్ణయించగా.. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ తెలంగాణలో చెరో ఒక బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న దేశవ్యాప్తంగా ఉన్న పది లక్షల మంది బూత్‌స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తారు.
మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో దేశవ్యాప్తంగా 396 బహిరంగ సభలు ఏర్పాటు చేశామని, వీటిల్లో భాగంగా ఈ వర్చువల్ సమావేశం కూడా ఏర్పాటు చేశామని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా వివిధ రంగాల్లో లక్ష మంది ప్రముఖులతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దక్షిణాదిన పాగా వేయాలని చూసిన భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇక తెలంగాణలో అయినా సత్తా చాటాలని.. వచ్చే ఎన్నికల లోపు బూత్ స్థాయిలో బలంగా తయారవ్వాలని భావిస్తోంది. దీంతో తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. పలువురు బీజేపీ నాయకులు వచ్చే ఎన్నికల లోపు చాలా సార్లు తెలంగాణకు రానున్నారు.