తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్చి చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నట్లు సమాచారం. యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే దక్షిణ భారత దేశంలో భలోపేతం అవుతుందని యోచనలో బీజేపీ జాతీయనాయకత్వం ఉంది. దీంతో ఈ నెల చివరి వారంలో గానీ, ఏప్రిల్ మొదటి వారంలో కానీ జనగాంలో భారీ బహిరంగ సభ నిర్వహించతలపెట్టినట్లు సమాచారం. ఆ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఏప్రిల్ 14న అమిత్ షా తెలంగాణకు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సజయ్ చేపట్టనున్న ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిషా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా అమిత్ షా రెండురోజుల పాటు తెలంగాణలోనే మఖాం వేయనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పర్యటనలో అమిత్ షా బూత్ లెవల్ కార్యకర్తలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. అమిత్ షా రానున్న నేపథ్యంలో చేరికలకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీతో టచ్ లో ఉన్న పలువురు ముఖ్య నేతలు బీజేపీ గూటికి చేరనున్నారనే వార్తలు వినవస్తున్నాయి.