నితిన్ గడ్కరీతో ఈట‌ల భేటీ.. చ‌ర్చించిన అంశాలివే..

మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అయ్యారు.

By Medi Samrat
Published on : 28 Jun 2024 2:21 PM IST

నితిన్ గడ్కరీతో ఈట‌ల భేటీ.. చ‌ర్చించిన అంశాలివే..

మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం, తెలంగాణ సమస్యలను ఆయ‌న‌కు ఈటెల వివరించారు. అనంత‌రం తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కొంపల్లి ప్లై ఓవర్‌ అండర్ పాస్, నత్తనడక నడుస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, శామీర్ పేట రోడ్డు, ఎల్బీ నగర్ అండర్ పాస్, హుజూరాబాద్ రోడ్డు సమస్యలపై చర్చించామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించేవన్నీ అండర్ పాస్ లు కాకుండా ఫ్లై ఓవర్ లు నిర్మించాలని కోరామన్నారు.

హుజూరాబాద్ లో సింగాపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్దపాపాయపల్లిలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరిన‌ట్లు తెలిపారు. సమగ్రంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Next Story