గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్‌లో ఎక్కువ పేజీలు: కిషన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు.
By Srikanth Gundamalla Published on 10 Feb 2024 6:20 PM ISTగత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్‌లో ఎక్కువ పేజీలు: కిషన్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆరు గ్యారెంటీల అమలుకు పెద్ద పీట వేసింది. రూ.2,75,891 కోట్లతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు.ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్‌పై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పాలన అంకెల గారడీ, మాటల గారడీ అని కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్‌లో ఎక్కువ పేజీలను కేటాయించారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం కేటాయింపులు లేవని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందిన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుకు రూ.28వేల కోట్ల సరిపోవని అన్నారు. బీసీ సంక్షేమానికి రూ.8వేల కోట్లు కేటాయించి వారికి తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ఇక ఆరు గ్యారెంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారెంటీ అమలు చేయరా అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ బడ్జెట్‌పై బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడారు. వాస్తవ పరిస్థితికి బడ్జెట్ ప్రతిపాదనలకు పొంతన లేదన్నారు. రూ.5లక్షల కోట్లు పెడితే కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీల అమలు వీలుకాదని చెప్పారు. వ్యవసాయానికి రూ.19వేల కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదని చెప్పారు. రైతుబంధు, కౌలు రైతులకు డబ్బులు, ధాన్యానికి రూ.500 బోనస్, రూ.2లక్షల రుణమాఫీ ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ ప్రశ్నించరు. ఈ ఏడాదిలో రుణమాఫీ చేస్తారా లేదా చెప్పాలని అన్నారు. ఆటో డ్రైవర్లకు భృతి కూడా బడ్జెట్‌లో లేదనీ.. ప్రభుత్వం బెల్ట్ షాపులను రద్దు చేస్తుందా లేదా అని నిలదీశారు. దళితబంధు అమలు చేస్తారా లేదా కూడా చెప్పాలని ఈటల రాజేంద్ డిమాండ్ చేశారు.