బీజేపీని గెలిపిస్తే.. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి.. వారికి ఇస్తాం: అమిత్‌ షా

2024 ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అని, ఇది అభివృద్ధికి ఓటు - జిహాద్‌కు ఓటు మధ్య పోటీ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు.

By అంజి  Published on  9 May 2024 8:44 AM GMT
BJP, election campaign, Rayagiri, Amit Shah

బీజేపీని గెలిపిస్తే.. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి.. వారికి ఇస్తాం: అమిత్‌ షా

హైదరాబాద్: 2024 ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అని, ఇది అభివృద్ధికి ఓటు - జిహాద్‌కు ఓటు మధ్య పోటీ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని రాయగిరిలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘చైనీస్ హామీ’కి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘భారతీయ హామీ’కి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏఐఎంఐఎంల మధ్య ట్రయాంగిల్‌ బంధం ఉందని అభివర్ణించిన ఆయన, ఈ పార్టీలు రామనవమి ఊరేగింపు జరగనివ్వవని, సీఏఏను కూడా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ''ఈ వ్యక్తులు 'హైదరాబాద్ విమోచన దినోత్సవం' (సెప్టెంబర్ 17) జరుపుకోవడానికి అనుమతించరు. ఈ వ్యక్తులు సీఏఏని వ్యతిరేకిస్తున్నారు. ఇంతమంది షరియా, ఖురాన్ ఆధారంగా తెలంగాణను నడపాలని చూస్తున్నారు'' అని అమిత్‌ షా అన్నారు. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్నారు. అక్కడ ఆర్టికల్‌ 370 రద్దు చేసి త్రివర్ణ పతాకం ఎగురవేశామన్నారు.

''తెలంగాణ ప్రజలకు కశ్మీర్‌తో ఏం సంబంధం అని ఖర్గే ప్రశ్నించారు. ఖర్గే గారు కశ్మీర్‌ కోసం రాష్ట్ర వాసులు తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు'' అని అమిత్‌ షా తెలిపారు. తెలంగాణలో ఈసారి బీజేపీ 10కిపైగా ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. మూడు విడతల్లో ఇప్పటికే 200 సీట్లకుపైగా స్థానాల్లో గెలుస్తున్నామని, మొత్తం 400 స్థానాలు సాధిస్తామన్నారు. తెలంగాణలో డబులు డిజిట్‌ స్కోర్‌.. దేశంలో 400 సీట్లకు మార్గం సుగమం అవుతుందన్నారు. భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్‌ను గెలిపిస్తే.. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి.. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని ప్రకటించారు.

Next Story