నిజాం చక్కెర కర్మాగారం.. ఏమైంది : బండి సంజయ్

BJP Cheif Slams CM KCR. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్.. ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చారని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

By Medi Samrat  Published on  12 March 2021 12:22 PM GMT
BJP Cheif Slams CM KCR

తెలంగాణలో ఈ మద్య వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికలు కాకుండా ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గతంలో కన్నా బీజేపీ ఈసారి ఎక్కువ సీట్లు సంపాదించాయి. ఇదే జోష్ లో ఉన్న బీజేపీ ఈసారి ఎమ్మెల్సీలో కూడా తమ సత్తా చాటుతామంటున్నారు. రెండు ఎమ్మెల్సీ రెండు స్థానాల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఓడి పోతున్నామని తెలిసే ఓటర్ ని సీఎం కేసీఆర్‌ రిక్వెస్ట్ చేయలేదని.. అహంకారంతో వ్యవహరించే సీఎంకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్.. ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చారని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పీఆర్సీ ఎట్లా ఇస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మంత్రి కేటీఆర్ కు ఎందుకని ప్రశ్నించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను పట్టభద్రుల ఆశీర్వాదంతో గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు బిజేపి కి అనుకూలంగా ఉన్నాయని బండి వెల్లడించారు.

అహంకారపూరితంగా ఓట్లు అడగని కేసీఆర్ కు ఓటెందుకు వేయాలో ఆలోచించించుకోవాలని పట్టభద్రులకు సూచించారు. రాష్ట్రంలో అజాంజాహీ మిల్లు, నిజాం చక్కెర కర్మాగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. ఓయూ, కేయూలను నిర్వీర్యం చేసి నలుగురు అనుచరులకు ప్రైవేటు యూనివర్సిటీలను కట్టబెట్టారని దుయ్యబట్టారు. అభివృద్ధిపై చర్చకు రావాలని కేసీఆర్ కు అనేక సార్లు సవాల్ విసిరినా ఇప్పటి వరకు రాలేదని ఎద్దేవాచేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో టి.అర్.ఎస్ ను ఓడిస్తేనే ఎన్నికల హామీలు నెరవేరుతాయని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Next Story
Share it