బిజేపి పోరాటం.. వారి కోస‌మే.. : బండి సంజయ్

BJP Cheif Bandi Sanjay Speech. బడగు-బలహీన వర్గాల కోసం బిజేపి పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

By Medi Samrat  Published on  8 Feb 2021 12:37 PM GMT
BJP Cheif Bandi Sanjay Speech

బడగు-బలహీన వర్గాల కోసం బిజేపి పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఓబీసీ మోర్చా పదాధికారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్‌.. గుర్రంబోడు ఘటనపై స్పందించారు. సూర్యాపేట జిల్లా బీజేపి అధ్యక్షుడితో సహా అనేక మందిని పోలీసులు కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. వారు ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. వారికి ఏ హాని జరిగినా ఫాం హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

గిరిజన భూముల కోసం వెళ్తే.. కబ్జాదారుల కోసం పోలీసులతో దాడి చేయించారని ఆరోపించారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని.. తమవారిని వదిలిపెట్టాలని కోరారు. నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో గిరిజనులు తెరాసకు బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు.Next Story
Share it