Telangana: మున్సిపల్‌ ఎన్నికల వేళ.. కలకలం రేపుతోన్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య

మున్సిపల్‌ ఎన్నకల వేళ.. నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో ఆరో వార్డుకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

By -  అంజి
Published on : 10 Feb 2026 10:35 AM IST

BJP candidate Mahadevappa,  Maktal Municipality,  suicide, Telangana

Telangana: మున్సిపల్‌ ఎన్నికల వేళ.. కలకలం రేపుతోన్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య  

మున్సిపల్‌ ఎన్నకల వేళ.. నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో ఆరో వార్డుకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఉరివేసుకుని చనిపోయారు. పోటీ నుంచి తప్పుకోవాలని ప్రత్యర్థి నాయకులు ఆయన్ను వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంత్రి శ్రీహరి, ఆయన అనుచరుల వేధింపులే మహదేవప్ప మరణానికి కారణం అని తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌ రావు ఆరోపించారు.

మున్సిపాలిటీలోని ఆరో వార్డు పరిధిలోని చందాపూర్‌ గ్రామానికి చెందిన మహాదేవప్ప (48) బీజేపీ తరపున కౌన్సిలర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రత్యర్థుల వేధింపులతో మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన భార్య సత్తెమ్మ ఆరోపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రేపు పోలింగ్‌ జరగనుండగా.. ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

Next Story