Telangana: టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి శుక్రవారం విజయం సాధించారు.

By అంజి
Published on : 17 March 2023 11:25 AM IST

AVN Reddy, Telangana , Teachers MLC seat

Telangana: టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు

హైదరాబాద్: తెలంగాణలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుని(ఎమ్మెల్సీ) స్థానంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి శుక్రవారం విజయం సాధించారు. 21 రౌండ్ల కౌంటింగ్ అనంతరం ఏవీఎన్ రెడ్డి 13,436 ఓట్లను సాధించి, 12,709 ఓట్లను అధిగమించి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో ఆయన ప్రత్యర్ది పీఆర్‌టీయు అభ్యర్ధిపై 1150 ఓట్ల తేడాతో పైచేయి సాధించారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

అంతకుముందు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (లీగల్), రిటర్నింగ్ అధికారి ప్రియాంక.. కౌంటింగ్‌ ప్రక్రియను వివరిస్తూ మొత్తం 25,868 ఓట్లు పోల్ అయ్యాయని, విజేతగా ప్రకటించడానికి అభ్యర్థి 12,709 ఓట్లను సాధించాల్సి ఉందని తెలిపారు. కౌంటింగ్ రోజు రాత్రి 8 గంటల వరకు పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డిపై ఏవీఎన్ రెడ్డి 943 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థికి 7,584 ఓట్లు రాగా, జి చెన్న కేశవ రెడ్డికి 6,641 ఓట్లు, పాపన్నగారి మాణిక్ రెడ్డికి 4,644 ఓట్లు వచ్చాయి.

తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్

తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 13న పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలోని తొమ్మిది జిల్లాల్లో 29,720 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఈ పోలింగ్‌లో అత్యధికంగా 90.40 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఎమ్మెల్యే కోటాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు చల్లా వెంకటరామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, కే నవీన్‌కుమార్‌లు ఏకగ్రీవంగా విజయం సాధించారు.

రాష్ట్రంలో తన ఉనికిని పటిష్టం చేసుకునేందుకు ఏ మాత్రం తిరుగులేని బీజేపీకి తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ సీటులో ఏవీఎన్ రెడ్డి విజయం సాధించడం విశేషం. ఈ విజయం రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ విశ్వాసాన్ని పెంచుతుంది.

Next Story