అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.. హుజురాబాద్ బీజేపీ అభ్య‌ర్ధిగా ఈట‌ల

BJP Announced Huzurabad Candidate.హుజూరాబాద్ అభ్య‌ర్థిని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Oct 2021 7:19 AM GMT
అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.. హుజురాబాద్ బీజేపీ అభ్య‌ర్ధిగా ఈట‌ల

హుజూరాబాద్ అభ్య‌ర్థిని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా తాజాగా బీజేపీ కూడా త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌మ పార్టీ త‌రుపున పోటీ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా చెప్పేసింది. దీనిపై బీజేపీ అధిష్టానం ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. హుజూరాబాద్‌తో పాటు మిజోరాంలోని తురివాల్, మహారాష్ట్రలోని చెగలూరు నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకూ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.

ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. తెరాస నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీలో చేరారు ఈట‌ల‌. అప్పట్నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. కొన్ని రోజుల పాటు పాదయాత్ర కూడా చేశారు. ఈట‌ల పోటీ చేస్తున్న‌ట్టు బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో.. ఆ నియోజ‌క వ‌ర్గంలో త్రిముఖ‌పోటీ జ‌ర‌గ‌నుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తుండ‌గా.. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్‌యుఐ అధ్య‌క్షుడు బ‌ల్మూరీ వెంక‌ట్‌ పోటీ చేస్తున్నారు. ఈ నెల 30న ఎన్నిక జ‌ర‌గ‌నుండ‌గా.. న‌వంబ‌ర్ 2న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

Next Story