Telangana: కొత్త రేషన్‌ కార్డుల జారీపై బిగ్‌ అప్‌డేట్‌

త్వరలోనే రాష్ట్రంలోని అర్హులు అందరికీ కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ అసెంబ్లీలో ప్రకటించారు.

By అంజి  Published on  31 July 2024 6:30 AM IST
new ration cards, Telangana, CM Revanth, Minister Uttam

Telangana: కొత్త రేషన్‌ కార్డుల జారీపై బిగ్‌ అప్‌డేట్‌

హైదరాబాద్‌: త్వరలోనే రాష్ట్రంలోని అర్హులు అందరికీ కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఎల్లుండి మంత్రి వర్గ సమావేశంలో దీనిపై విధి విధానాలు ఖరారు చేస్తామని వెల్లడించారు. రేషన్‌ కార్డు ఉన్న వారందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ హాయాంలో ఒక్క కొత్త రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్‌ విమర్శించారు. తెల్ల రేషన్​కార్డు ఉన్నవారందరికీ రూ.500కే సిలిండర్​ ఇస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బీఆర్​ఎస్​ఎమ్మెల్యే గంగుల కమలాకర్​.. నూతన రేషన్​కార్డుల జారీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి సమాధానం ఇచ్చారు.

మంగళవారం నాడు పౌర సరఫరాల శాఖ పద్దులపై వాడివేడి చర్చలు జరగగా, అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అంతకుముందు అసెంబ్లీలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ వేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కార్డుల జారీపై త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామన్నారు. ఆ తర్వాత కొత్త కార్డుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Next Story