హైదరాబాద్: రాష్ట్రంలో 563 గ్రూప్ - 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసింది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు టీజీపీఎస్‌సీ కసరత్తు చేస్తోంది. 1 : 2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఉండనుంది. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. అంటే ఒక్కో పోస్టుకు 38 మంది పోటీ పడుతున్నారు. ఫలితాల విడుదల తర్వాత ఆయా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. ఈ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యకే గ్రూప్ - 2, 3 ఫలితాలు వెల్లడించే ఛాన్స్ ఉంది.
బ్యాక్‌లాగ్‌లు లేకుండా ఉండేందుకు టీజీపీఎస్‌సీ ఇలా చర్యలు తీసుకుంటోంది. గ్రూప్ -1 ఫలితాల వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నట్టు ఉద్యోగ ప్రకటనలో కమిషన్ పేర్కొంది. 6 పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు ప్రకటించనుంది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో సబ్జెక్టుల వారీగా మార్కులను అందుబాటులో ఉంచనుంది. ఈ మార్కుల లెక్కింపుపై సందేహాలు ఉంటే రీ కౌంటింగ్ ఆప్షన్ కల్పించనుంది.