సోనుసూద్ ను చూసి టాలీవుడ్ స్టార్స్ నేర్చుకోవాలని అంటున్న కాంగ్రెస్ నేత

Bhatti Vikramarka Praises Sonu Sood. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో న‌టుడు సోనుసూద్ చేస్తున్న సాయంపై పొగడ్తల వర్షం కురిపించారు.

By Medi Samrat  Published on  18 May 2021 3:32 PM IST
Batti Vikramarka prises sonu

భారతదేశంలో కరోనా కష్టకాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి వారికి అండగా నిలుస్తున్న వారిలో సోనూ సూద్ ముందు ఉన్నారు. ఆయన తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తూ వస్తున్నారు. తమకు అండగా నిలిచిన సోనూ సూద్ కు థాంక్స్ అని ఎంతో మంది తెలిపారు. నెల్లూరు జిల్లాలో రూ. 1.5 కోట్ల ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాడు సోనూ సూద్. నెల్లూరులోని జెండా వీధిలో ఉంటున్న సోనూ మిత్రుడు సమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకకపోవడమే వారి మృతికి కారణమని తెలియడంతో.. తీవ్ర కలత చెందిన సోనూ సూద్ నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించాడు.

ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూ ముందుకొచ్చిన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సమీర్ తీసుకెళ్లాడు. సోనూతో ఫోన్‌లో మాట్లాడించాడు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆత్మకూరు, లేదంటే కావలిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నారు. సోనూ ఆక్సిజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ధ్రువీకరించారు. జిల్లాలో రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను సూద్ అందిస్తున్నారని తెలిపారు. సోనూ సూద్ లాగే మిగిలిన సినిమా తారలంతా కూడా సహాయం చేస్తే చాలా బాగుంటుందని పలువురు కోరారు. చాలా మంది సినిమా స్టార్స్ తమకు తోచినంత సహాయం చేస్తున్నారనుకోండి.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో న‌టుడు సోనుసూద్ చేస్తున్న సాయంపై పొగడ్తల వర్షం కురిపించారు. సోను సూద్ ను చూసి మన హీరోలు, హీరోయిన్లు కూడా కళ్లు తెరవాలని అన్నారు. కరోనా బాధితులను ఆదుకోడానికి టాలీవుట్ హీరో, హీరోయిన్లు ముందుకొచ్చి సాయం చేయాలని సూచించారు భ‌ట్టి విక్ర‌మార్క‌. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. సీఎస్ సోమేశ్ కుమార్ సీరియస్ గా పనిచేయడం లేదని..ఓ సమావేశంలో బిస్కెట్స్ తినుకుంటూ కనిపిస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాలు గాలికి వదిలారని.. ఫార్మా కంపెనీలతో సీఎస్, టాస్క్ ఫోర్స్ ఛైర్మెన్, మంత్రి కేటీఆర్ స‌మావేశం అయ్యారు కానీ అస‌లు ఆ మీటింగ్ లో ఏం మాట్లాడారని ప్ర‌శ్నించారు.


Next Story