భారత్ జోడో యాత్ర: రాహుల్‌కు రోహిత్ వేముల తల్లి సంఘీభావం

Bharat Jodo Yatra.. Rohith Vemula’s mother joins Rahul, extends solidarity. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ఏడో రోజు కొనసాగుతోంది. ఇవాళ శంషాబాద్‌ నుంచి

By అంజి  Published on  1 Nov 2022 5:31 AM GMT
భారత్ జోడో యాత్ర: రాహుల్‌కు రోహిత్ వేముల తల్లి సంఘీభావం

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ఏడో రోజు కొనసాగుతోంది. ఇవాళ శంషాబాద్‌ నుంచి యాత్ర ప్రారంభమైంది. శంషాబాద్ నుంచి కాలేజి విద్యార్థులతో కలిసి రాహుల్‌ నడిచారు. వారితో ముచ్చటిస్తూ రాహుల్‌ పాదయాత్ర చేశారు. భారత్ జోడో యాత్రలో వేధింపుల కారణంగా 2016లో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి పాల్గొన్నారు. ఉదయం యాత్రలో భాగంగా రాధిక వేముల రాహుల్‌ గాంధీతో కలిసి కొద్దిసేపు నడిచారు. ''భారత్ జోడో యాత్రకు సంఘీభావం, రాహుల్ గాంధీతో కలిసి నడిచాను. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ దాడి నుండి రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు. రోహిత్ వేములకి న్యాయం, రోహిత్ చట్టం, దళితులకు, అణగారిన వర్గాలకు ఉన్నత న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యం, అందరికీ విద్య ఉండాలని'' రాధిక వేముల ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి.. భారత్ జోడో యాత్రలో గాంధీతో కలిసి నడుస్తున్న రాధిక వేముల చిత్రాలను ట్వీట్ చేశారు. జనవరి 17, 2016న 26 ఏళ్ల దళిత విద్యార్థి మరణంతో ఉన్నత విద్యాసంస్థల్లో కులతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది.

నేడు యాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించనుంది. ఆరాంఘర్‌ మీదుగా పురానాపూల్‌ మీదుగా నగరంలోకి యాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం పురానాపూల్ నుంచి చార్మినార్ మీదుగా యాత్ర నెక్లెస్ రోడ్ చేరుకోనుంది. రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభంపై జాతీయ పతాకాన్ని రాహుల్‌ ఆవిష్కరించనున్నారు. సాయంత్రం రాహుల్ తో పాటు జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. రాత్రి 7గంటలకు నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ ఉంటుంది. అనంతరం బోయిన్ పల్లి లోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో రాహుల్‌ బస చేయనున్నారు.Next Story
Share it