తెలంగాణలో ఇవాళ్టితో ముగియనున్న.. భారత్‌ జోడో యాత్ర

Bharat Jodo Yatra continues in Kamareddy district on last day in Telangana. తెలంగాణలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ

By అంజి  Published on  7 Nov 2022 9:38 AM GMT
తెలంగాణలో ఇవాళ్టితో ముగియనున్న.. భారత్‌ జోడో యాత్ర

తెలంగాణలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కామారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పాదయాత్ర చేశారు. జుక్కల్‌లో రాత్రి విరామం తర్వాత, కాంగ్రెస్ ఎంపీ ఫత్లాపూర్ బస్టాండ్ నుండి తన పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. మధ్యాహ్న విరామం కోసం షేఖాపూర్‌లో యాత్ర నిలిచిపోయింది. పార్టీ రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో కాంగ్రెస్‌ నేతలు సంభాషించి వారి సమస్యలను తెలుసుకున్నారు. సాయంత్రం కొనసాగనున్న యాత్రలో భాగంగా.. తెలంగాణలో చివరిదైన మేనూరులో బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తారు.

సోమవారం రాత్రి మిరాజ్‌పూర్ హనుమాన్ మందిర్ నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించి పొరుగున ఉన్న మహారాష్ట్రలో అడుగుపెట్టనున్నారు. డెగ్లూర్‌లోని కళామందిర్‌లో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపిసిసి) నాయకులు రాహుల్ గాంధీకి స్వాగతం పలకనున్నారు. సోమవారం భారత్ జోడో యాత్ర 61వ రోజు. ప్రజలను ఏకం చేయడానికి రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7 న కన్యాకుమారి నుండి యాత్రను ప్రారంభించారు. శ్రీనగర్‌లో ముగిసే ముందు 3,750 కిలోమీటర్లు నడిచే ఈ పాదయాత్ర 12 రాష్ట్రాల గుండా వెళుతుంది.

ఈ యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లను కవర్ చేసింది. ఇది అక్టోబరు 23న కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించింది. యాత్రికులకు రాష్ట్రం గుండా నాలుగు రోజుల విరామం లభించింది. తెలంగాణలోని 19 అసెంబ్లీ, ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 375 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'కు రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చెప్పారు. దక్షిణ భారత్ లోని ఐదు రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని, ఈరోజు మహారాష్ట్రలోకి చేరుకుంటుందన్నారు. నేటితో దక్షిణ భారత్ లో పాదయాత్ర ముగిసిందని, రేపటి నుంచి ఉత్తర భారత్ లో పాదయాత్ర మొదలవుతుందన్నారు.

Next Story
Share it