కోడలిపై లైంగిక వేధింపులు.. భద్రాద్రి ఆలయ పూజారి సస్పెన్షన్‌

భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్ వేటు పడింది.

By అంజి  Published on  19 Sept 2024 11:00 AM IST
Bhadradri, temple priest, suspended, sexual abuse FIR

కోడలిపై లైంగిక వేధింపులు.. భద్రాద్రి ఆలయ పూజారి సస్పెన్షన్‌

హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్ వేటు పడింది. పూజారి తన కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ సమాచారాన్ని ఆలయ అధికారులకు దాచిపెట్టారంటూ రామానుజాచార్యులుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తన మామగారు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, అత్త, ఇతర కుటుంబ సభ్యులు తనను రూ.10 లక్షల కోసం వేధించారని కోడలు ఆగస్టు 14న ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై భద్రాద్రి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్ రమాదేవి స్పందిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు రామానుజాచార్యులు, ఆయన దత్తపుత్రుడు పొడిచేటి తిరుమల వెంకట సీతారాం ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. సీతారామానుజాచార్యులకు కుమారులు లేరు. ఈ క్రమంలోనే ఆయన కొన్నేళ్ల కిందట వెంకట సీతారాంను దత్తత తీసుకున్నారు. 2019లో సీతారాంకు బాధితురాలితో పెళ్లి జరిగింది. కొన్ని రోజులకే సీతారాం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త, అత్తమామలు, ఆడపడుచులు వరకట్నం కోసం బాధితురాలిని వేధించారు. ఈ క్రమంలోనే మామ సీతారామానుజాచార్యులు కోడలిపై లైంగిక వేధింపులు ఆరంభించాడు. తన గోడును భర్తకు వెళ్లబోసుకుంది భార్య. అయితే భర్త తన తండ్రికి అనుకూలంగా మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి సీతారామానుజాచార్యులు మరింత రెచ్చిపోయారు. తనకు తన పోలికలతో ఒక బాబు కావాలని కోడలిపై ఒత్తిడి చేశాడు. దీంతో బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Next Story