మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తమకు ఇష్టం ఉన్న వారికే దళిత బంధు ఇస్తాం అంటూ ఫైర్ అయ్యారు. దళితబంధు వచ్చే వరకు ఓపిక లేకుంటే ఏం చేయలేం అంటూ వ్యాఖ్యానించారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా.. అర్హులైనప్పటికీ పథకం డబ్బులు అందలేదని కొందరు మహిళలు మంత్రికి తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి దళిత బంధు అందుతుందని ఇంద్రకరణ్ తెలిపారు.
''మీకు ఓపిక లేకుంటే మేం ఏం చేయాలి. ఏ ఊకుండమ్మా.. నువ్వు మాట్లాడకు. మా ఇష్టమొచ్చినొళ్లకు ఇచ్చుకుంటాం. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అట్ల.. బయటకు తీసుకుపోండి. పో బయటకు పో..'' అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. ఈ పథకం కోసం రూ. 1.5 కోట్లు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. మహిళలు దళితబంధు గురించి నిలదీయంతో మంత్రి ఆగ్రహాంతో ఊగిపోయారు. తమకు విధేయులు కాబట్టి బీజేపీ నేతలను అడగాలన్నారు.
కొంత సమయం తరువాత, మంత్రి తనను తాను నియంత్రించుకుని, పథకానికి లబ్ధిదారుల ఎంపిక తమ ఇష్టం అని చెప్పారు. దళితుల బంధుపై ప్రశ్నిస్తున్న మహిళలను తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు. ఇంద్రకరణ్ మహిళలతో సంభాషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల నర్సాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కళ్యాణలక్ష్మి పథకం కింద డబ్బులు రాలేదని ఓ యువకుడు చెప్పడంతో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అతన్ని తిట్టి, సభ నుంచి తీసుకెళ్లమని పోలీసులను ఆదేశించాడు.