సూర్యాపేటలోని రెసిడెన్షియల్ కాలనీలో ఎలుగుబంటి సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం శ్రీనివాస కాలనీలో ఎలుగుబంటి కనిపించింది. పట్టణంలోని కాలనీలోని డి-మార్ట్ మాల్ వెనుక నిర్మాణంలో ఉన్న భవనంలో నివాసితులు మొదట చూశారు. అనంతరం తండు శ్రీనివాస్‌కు చెందిన ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లి ఎలుగుబంటి బాత్‌రూమ్‌లో దాక్కుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చివరిగా వారు ఎలుగుబంటిని పట్టుకుని సురక్షితమైన ప్రదేశానికి మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో రెండు పిల్లలతో ఎలుగుబంటి సంచరించాయి. శ్రీవారి మెట్టు మార్గంలోని 1200వ మెట్టు దర్శన కౌంటర్ సమీపంలో ఎలుగుబంట్లు కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. దర్శన కౌంటర్‌లో పనిచేస్తున్న టీటీడీ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చేలోగా ఎలుగుబంటి.. రెండు పిల్లలతో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది