తెలంగాణ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 8 Oct 2023 10:53 AM ISTతెలంగాణ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాటలు ఎప్పుడూ సంచలనంగానే ఉంటాయి. ఆయన మాట్లాడితేనే కాంట్రవర్సీ అవుతుంది. అయితే.. గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టికెట్లు కేటాయించక ముందు తానూ పోటీ చేస్తాననే ప్రచారం కూడా చేసుకున్నారు. అంతేకాదు.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దీమాగా చెప్పారు. అధికారంలోకి రాకపోతే ఏదేదేదో చేస్తానంటూ కామెంట్స్ చేశారు. అయితే.. బండ్ల గణేష్‌పై వచ్చిన ట్రోలింగ్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ఆయన చేసిన కామెంట్స్, చెప్పిన మాటలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇక అధికారపార్టీ పైనా బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తి మరోసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో పోటీ చేయడంపై బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.
బండ్ల గణేష్ మరోసారి రాజకీయంగా బిజీ కాబోతున్నాడు. అయితే.. ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మాత్రమే కృషి చేస్తానని చెప్పాడు. అందుకోసం సాయశక్తుల పనిచేస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు పెట్టాడు బండ్ల గణేష్. ఈ సారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని అన్నాడు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అవకాశం ఇస్తానని చెప్పారని అన్నాడు. కానీ..తనకు టికెట్ వద్దు.. పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమని.. అందుకోసం పనిచేస్తానని అన్నాడు బండ్ల. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి తనపట్ల చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే.. టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం పనిచేస్తానని వెల్లడించాడు. కాంగ్రెస్ తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని.. రేవంత్ నాయకత్వంలో పనిచేస్తామని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.
గత ఎన్నికల్లోనే బండ్ల గణేష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బండ్ల అంచనాలకు తలకిందులుగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ ఓటమి పాలైంది. దాంతో.. తనకు రాజకీయాలు సెట్ కావని.. సినిమాలు చేసుకుంటానని చెప్పాడు. రాజకీయాలకు దూరంగా ఉంటా అన్నట్లుగా చెప్పుకొచ్చాడు బండ్ల. అయితే.. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. తాజగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటేనే కదా టికెట్ ఇస్తారు.. మీరు దరఖాస్తు చేసుకోలేదంటున్నారు మరి టికెట్ ఇస్తానని రేవంత్ ఎలా చెప్పారంటూ బండ్ల గణేష్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి గారు నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు.…
— BANDLA GANESH. (@ganeshbandla) October 8, 2023