ఖమ్మంలో బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం

Bandi Sanjay’s effigy burnt in Khammam. ఎమ్మెల్సీ కె.కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ

By Medi Samrat  Published on  11 March 2023 7:43 PM IST
ఖమ్మంలో బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం

Bandi Sanjay’s effigy burnt in Khammam




ఎమ్మెల్సీ కె.కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు శనివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఖమ్మంలో పార్టీ కార్యకర్తలు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఇల్లందు కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టి బీజేపీ నేత సంజ‌య్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. మేయర్ పి.నీరజ, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ క‌విత‌పై బీజేపీ నాయకుడు సంజ‌య్ వ్యాఖ్యలు తీవ్ర ఖండనీయమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు తావులేదన్నారు. నిరసనలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్లు రావూరి కరుణ, సరస్వతి, విజయ నిర్మల, తోట ఉమారాణి, మాటేటి అరుణ, గజ్జెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని సత్తుపల్లి, కొత్తగూడెం, పాలేరు తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో నిరసనలు చేపట్టారు.


Next Story