వారి కోసం అవసరమైతే గూండాగిరి చేస్తాం: బండి సంజయ్

Bandi Sanjay says that he will do hooliganism for the poor if necessary. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పోలీసులను అడ్డుపెట్టుకుని

By అంజి  Published on  18 Aug 2022 3:59 PM GMT
వారి కోసం అవసరమైతే గూండాగిరి చేస్తాం: బండి సంజయ్

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్‌ గూండాగిరి చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ చేయించే దాడులకు బీజేపీ భయపడదన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జనగామలో నిర్వహించిన సభలో బండి సంజయ్‌ మాట్లాడారు. ఎర్రవాళ్లను, పచ్చవాళ్లను ఎవరిని తెచ్చుకున్నా తాము భయపడేది లేదన్నారు. బీజేపీతో బల ప్రదర్శనకు కేసీఆర్‌ సిద్ధమా? అంటూ సంజయ్‌ ప్రశ్నించారు.

బీజేపీ హిందూ ధర్మం కోసం పనిచేస్తుందని, పేదల కోసం అవసరమైతే గూండాగిరి చేస్తామని హెచ్చరించారు. బీజేపీ ఏ మతానికి, ప్రాంతానికి వ్యతిరేకం కాదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. 80 శాతం మంది ఉన్న హిందువులు అందరూ ఓటు బ్యాంకుగా మారితేనే దేశాన్ని కాపాడుకోగలమని వ్యాఖ్యానించారు. తమ ప్రజా యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ల‌ఫంగా గాళ్లు అంటూ టీఆర్ఎస్ పార్టీ లీడ‌ర్ల‌ను తూల‌నాడారు. ఏడు సంవత్స‌రాల్లో ఐదు సార్లు జైలుకు వెళ్లి వ‌చ్చాన‌ని, ఎవ‌రికీ భ‌య‌డ‌న‌న్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో కేంద్రం నిధులు ఉన్నాయని బండి సంజయ్‌ అన్నారు.

Next Story
Share it