నేడు ఢిల్లీకి బండి సంజయ్‌.. అగ్రనేతలతో భేటీ

Bandi sanjay Delhi Tour .. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. గ్రేటర్‌

By సుభాష్  Published on  6 Dec 2020 5:40 AM GMT
నేడు ఢిల్లీకి బండి సంజయ్‌.. అగ్రనేతలతో భేటీ

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో ఊహించని రీతిలో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్‌ షాను బండి సంజయ్‌ కలవనున్నారు. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వివరాలను పార్టీ అగ్రనేతలకు వివరించనున్నారు. అలాగే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఢిల్లీ పెద్దలు బండి సంజయ్‌కు సలహాలు, సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి భేటీ అనంతరం సంజయ్‌.. కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జావడేకర్‌, స్మృతీ ఇరానీలు సహా పలువురు నేతలను కలువనున్నారు.

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపనున్నారు. కాగా, గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా స్పందించిన విషయం తెలిసిందే. గ్రేటర్‌ ఫలితాలపై బండిపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ఈ గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనిస్తూ 48 సీట్లు సాధించుకుంది బీజేపీ.

Next Story
Share it