Telangana: రేపు బజరంగ్ దళ్ భారీ 'హనుమాన్ చాలీసా' కార్యక్రమాలు

కర్నాటకలో అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ హామీకి నిరసనగా భజరంగ్‌దళ్‌ తెలంగాణ యూనిట్

By అంజి  Published on  8 May 2023 10:00 AM IST
Bajrang Dal, Hanuman Chalisa, Telangana

Telangana: రేపు బజరంగ్ దళ్ భారీ 'హనుమాన్ చాలీసా' కార్యక్రమాలు

హైదరాబాద్: కర్నాటకలో అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ హామీకి నిరసనగా భజరంగ్‌దళ్‌ తెలంగాణ యూనిట్ మంగళవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ.. కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పార్టీని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పోల్చిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని ఆ పార్టీ ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ చర్యపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడించారు. ''కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులలో కొంత భావాన్ని పెంచడానికి రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, గ్రామాలు, జంక్షన్లలో భారీ 'హనుమాన్ చల్లీసా' పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలి'' అని బజరంగ్ దళ్ తెలంగాణ కన్వీనర్ శ్రీరాములు అన్నారు.

Next Story