Video: తెలంగాణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ముఖ్య నేతలు హాజరయ్యారు.