నేడు, ఆటోలు, క్యాబ్‌లు, లారీలు బంద్‌.. ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ

Auto cabs and Lorry services closed in Telangana Today.ఈ రోజు(గురువారం) అర్థ‌రాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవ‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2022 3:17 AM GMT
నేడు, ఆటోలు, క్యాబ్‌లు, లారీలు బంద్‌.. ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ

ఈ రోజు(గురువారం) అర్థ‌రాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవ‌లు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌న మోట‌ర్ వాహ‌నాల చ‌ట్టం 2019 అమ‌లు చేస్తూ జ‌రిమానాల పేరుతో ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ డ్రైవ‌ర్ల‌ను నిలువుదోపిడి చేస్తోంద‌ని డ్రైవ‌ర్స్ జేఏసీ మండిప‌డుతోంది. ఫిట్‌నెస్, లేట్ ఫీజు పేరుతో రోజుకు రూ.50 వసూలు చేయడాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ఈ క్ర‌మంలో నూత‌న చ‌ట్టాన్ని నిలిపివేయాల‌ని డిమాండ్ చేస్తూ ఒక్క రోజు వాహ‌నాల బంద్‌కు ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవ‌ర్స్ యూనియ‌న్ ఐకాస పిలుపునిచ్చింది. పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల‌తో అష్ట‌క‌ష్టాలు ప‌డి వాహ‌నాలు న‌డుపుతున్న త‌మ‌పై అద‌న‌పు భారం మోప‌డాన్ని వ్య‌తిరేకిస్తూ..ఈరోజు ట్రాన్స్‌పోర్టు భ‌వ‌న్ ముట్ట‌డించ‌నున్న‌ట్లు తెలియ‌జేసింది. ఖైర‌తాబాద్ చౌర‌స్తా నుంచి ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్ వ‌ర‌కు డ్రైవ‌ర్ల యూనియ‌న్ జేఏసీ భారీ ర్యాలీగా వెళ్లి త‌మ నిర‌స‌న తెలియ‌జేస్తామ‌ని ప్ర‌క‌టిచింది. ఇక బంద్ నేప‌థ్యంలో ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవ‌లు నిలిచిపోయాయి.

ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు..

ఆటోలు, క్యాబ్‌లు, లారీలు గురువారం బంద్ పాటిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు ఆర్టీసీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. న‌గ‌ర వ్యాప్తంగా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు టీఎస్ఆర్టీసీ వెల్ల‌డించింది. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని తెలిపింది. బ‌స్సులు అవ‌స‌రం అయితే.. 9959226160, 9959226154 నంబ‌ర్ల‌కు ఫోను చేయాల‌ని సూచించింది.

Next Story
Share it