బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి
సిద్దిపేట జిల్లాలో బీఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 2:18 PM ISTబీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి
సిద్దిపేట జిల్లాలో బీఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కొత్త ప్రభాకర్‌రెడ్డికి తీవ్ర గాయం అయ్యింది. వెంటనే స్పందించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆ క్రమంలోనే ఓ వ్యక్తి కొత్త ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్లాడు. మాట్లాడుతుండగానే కత్తి తీసి కడుపులో పొడిచాడు. ఆ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆందోళన నెలకొంది. నిందితుడు మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన రాజుగా తెలుస్తోంది. కడుపులో పొడవడంతో కొత్త ప్రభాకర్‌రెడ్డికి తీవ్ర గాయం అయ్యింది. వెంటనే స్పందించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. దాడికి పాల్పడ్డ వ్యక్తిని కూడా పట్టుకున్నారు. అతన్ని చితకబాదారు. కాగా.. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. ప్రస్తుతం మెదక్ లోక్‌సభ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. కొత్త ప్రభాకర్‌పై జరిగింది హత్యాయత్నం అంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కాగా.. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి సంగతి తెలియగానే మంత్రి హరీష్‌రావు ఫోన్‌లో పరామర్శించారు. అవసరం అయితే హైదరాబాద్ కు తీసుకురావాలని బీఆర్‌ఎస్ నేతలకు హరీష్‌రావు సూచించారు.
#TelanganaAssemblyElections2023బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డి కడుపులో తీవ్ర గాయమయింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. pic.twitter.com/YRijkuxxum
— Newsmeter Telugu (@NewsmeterTelugu) October 30, 2023