పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడో వ్యక్తి. పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది.

By అంజి  Published on  14 Jun 2024 10:23 AM IST
Peddapalli, Sulthanabad, Crime, Murder

పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడో వ్యక్తి. పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రైస్‌ మిల్లులో డ్రైవర్‌గా పనిచేసే బలరాం అనే వ్యక్తి ఓ ఆరేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడు. గురువారం రాత్రి సమయంలో సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైస్‌ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను సమీప పొదల్లోకి ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు.

అర్ధరాత్రి తన పడుకున్న తన కూతురు లేదని గుర్తించిన తల్లి వెంటనే అప్రమత్తమైంది. తల్లిదండ్రులు, తోటి కార్మికులు బాలిక కోసం వెతికారు. ఈ క్రమంలోనే బాలిక మృతదేహం లభ్యమైంది. అతడు బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తల్లిదండ్రులు, కార్మికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story