కరీంనగర్ లో అస్సాం ముఖ్యమంత్రి

Assam CM Himanta Biswa attended ‘Hindu Ekta Yatra’ in Karimnagar. అస్సాం ముఖ్యమంత్రి కరీంనగర్ కు వచ్చేసారు. ఇంతకూ ఆయన వచ్చిన కారణం ఏమిటంటే..

By M.S.R  Published on  14 May 2023 8:21 PM IST
కరీంనగర్ లో అస్సాం ముఖ్యమంత్రి

అస్సాం ముఖ్యమంత్రి కరీంనగర్ కు వచ్చేసారు. ఇంతకూ ఆయన వచ్చిన కారణం ఏమిటంటే.. 'హిందూ ఏక్తా యాత్ర'లో పాల్గొనడానికి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమైంది. ఏక్తా యాత్రతో కరీంనగర్ పట్టణం కాషాయమయమైంది. నగరంలోని మెయిన్ సెంటర్లలో కాషాయ జెండాలు, భారీ హనుమాన్ కటౌట్లను ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి రోజున హిందూ ఏక్తా యాత్ర పేరిట నిర్వహిస్తున్నారు. హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ హిందూ ఏక్తా యాత్ర చేస్తున్నామని బండి సంజయ్‌ చెప్పుకొచ్చారు. ఏక్తా యాత్రకు సీపీ సుబ్బారాయుడు పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

'ది కేరళ స్టోరీ' సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ కరీంనగర్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహిస్తున్న హిందూ ఏక్తా ర్యాలీలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అస్వస్థతకు గురైన కారణంగా తాను ఈ కార్యక్రమానికి దూరమయ్యానని.. అందుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.


Next Story