#AskKavitha: నెటిజన్లకు ఇంట్రెస్టింగ్‌ సమాధానాలు చెప్పిన కవిత

ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా తొలిసారి ఆస్క్ కవిత పేరుతో కాసేపు సరదాగా నెటిజన్లతో ముచ్చటించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

By Srikanth Gundamalla
Published on : 29 Oct 2023 8:30 AM IST

#AskKavitha, telangana, BRS, kavitha answers, social media users,

#AskKavitha: నెటిజన్లకు ఇంట్రెస్టింగ్‌ సమాధానాలు చెప్పిన కవిత

ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా తొలిసారి ఆస్క్ కవిత పేరుతో కాసేపు సరదాగా నెటిజన్లతో ముచ్చటించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజకీయ అభిప్రాయాలతో పాటు నెటిజన్లు ఆమె వ్యక్తిగత అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాదాపుగా నెటిజన్లు అడుగిన ప్రశ్నలకు సరదాగా.. అలాగే పొలిటికల్‌ ప్రశ్నలకు కౌంటర్లు వేస్తూ వచ్చారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా నెటిజన్లతో ఇంటరాక్ట్‌ అయిన కవిత.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఎన్నికల్లో సెంచరీ కొట్టటం ఖాయమని.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఎన్నికలపై చాలా మంది నెటిజన్లు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నలు అడిగారు. ఈ సారి రాష్ట్రంలో హంగ్ వస్తుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయని... దానిపై మీరేమంటారు అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దానికి కవిత తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 2018లోనూ ప్రతిపక్షాలు ఇదే ట్రిక్ ప్లే చేశాయని.. మళ్లీ ఇప్పుడు కూడా అదే అంటున్నాయన్నారు. అయితే.. అప్పటిలాగానే ఇప్పుడు కూడా చాలా సర్వేలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయని.. ఆ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని.. కానీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కవితి సమాధానం ఇచ్చారు.

ఇక ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మీ పాత్ర గురించి చెప్పాలంటూ ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. దానిపై కూడా స్పంఇంచిన కవిత ఆ స్కాం గురించి తనకు తెలియదని.. అందులో తన పాత్ర ఏమీ లేదని కవిత చెప్పారు. ఇక బీజేపీకి, బీఆర్ఎస్‌కు మధ్య డీల్ ఎంటీ అని ఓ నెటిజన్ అడగ్గా.. ఎలాంటి డీల్ లేదని.. తాము కేవలం రాజకీయ ప్రత్యర్థులమేనంటూ క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీతో బీఆర్ఎస్‌కు జట్టు లేదని.. తెలంగాణ ప్రజలే తమ జట్టు అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక కేసీఆర్ తర్వాత తనకు ఇష్టమైన రాజకీయ నేత మమతా బెనర్జీ అని కవిత తెలిపారు. తనకు తన అన్న కేటీఆర్‌కు మధ్య ఉన్న మధుర జ్ఞాపకాన్ని పంచుకోవాలంటూ అడిగిన నెటిజన్‌కు.. ఒక్కటని చెప్పటం కష్టమని చాలా సంతోషకరమైన జ్ఞాపకాలే ఉన్నాయంటూ సమాధానం ఇచ్చారు. ఇక తెలంగాణలో తనకు ఇష్టమైన ప్రదేశం ఏదని అడిగితే.. కుంటాల జలపాతం అని చెప్పుకొచ్చారు.

ఇక బీజేపీ బీసీ నాయకున్ని సీఎం చేస్తామని ప్రకటించటం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపెట్టనుందని అడగ్గా.. తెలంగాణ బీజేపీ నాయకత్వ బాధ్యతల నుంచి ఓ బీసీని తప్పించి అగ్రవర్ణాలకు అప్పగించిందని.. ఇక దేశంలో బీసీల కులగణనను చేపట్టేందుకు కేంద్రం నిరాకరిస్తుందని.. అటు మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కోటా ఇవ్వకపోవడంతో పాటు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటును సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉంచిందని.. మరోవైపు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని కూడా పక్కన పెట్టేసిందంటూ చెప్పుకొచ్చిన కవిత.. వీటన్నింటిని విస్మరించి ఇప్పుడు వచ్చి తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని చెప్పటం హాస్యాప్పదంగా ఉందన్నారు. ఇది కేవలం ఎన్నికల గిమ్మిక్కేనని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్టు గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా కవిత సమాధానం ఇచ్చారు. చంద్రబాబు అరెస్టుపై నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరం అన్నారు. చంద్రబాబు కుటుంబం బాధ, వారి పరిస్థితి అందరికీ అర్థమవుతుందన్నారు. చంద్రబాబు కుటుంబానికి సానుభూతి తెలిపారు.

ఈసారి తెలంగాణలో గెలిస్తే.. వచ్చే ఏపీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేయాలని ఓ ఆంధ్రా నెటిజన్ అడిగిన ప్రశ్నకు బాస్‌కా హుకూం అంటూ కేసీఆర్ ఫొటో షేర్ చేశారు. ఇక.. తనకు ఇష్టమైన హీరో ఎవరని ఓ నెటిజన్ అడగ్గా.. ఎప్పటికీ మెగాస్టారే తన ఫేవరెట్ అని.. ఆ తర్వాత అల్లు అర్జున్ అని చెప్పటమే కాదు తగ్గేదేలే అంటూ డైలాగ్ కూడా రాసుకొచ్చారు.

Next Story