పల్లీలు, ఉల్వలతో కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

Arrangements on for CM KCR's birthday on Friday.ఫిబ్ర‌వ‌రి 17 శుక్ర‌వారం రోజున కేసీఆర్ జన్మదిన వేడుకలను వినూత్నంగా

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 16 Feb 2023 10:00 PM IST

పల్లీలు, ఉల్వలతో కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

ఫిబ్ర‌వ‌రి 17 శుక్ర‌వారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌) అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు సిద్దమైంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు బాంధవుడికి జన్మదిన శుభాకాంక్షలు పేరుతో 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కేసీఆర్ చిత్రపటాన్ని వేరుశెనగ, ఉల్వలు, ఉప్పు, రంగులతో రూపొందించారు.


రేపు వనపర్తి మార్కెట్ యార్డులో రైతులతో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story