తన ఇంటికొచ్చి బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన సవాల్‌పై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పందించారు. ''ఉదయం 11 గంటల కల్లా నా ఇంటిపై జెండా ఎగురవేయకపోతే 12 గంటల కల్లా నేను మీ ఇంటికొస్తాను. బీఆర్‌ఎస్ పార్టీని భ్రష్టు పట్టించావు. నువ్వు వస్తే చేతులు కట్టుకుని కూర్చోను. ధైర్యం ఉంటే రా.. నువ్వో నేనో తేల్చుకుందాం.. దేనికైనా సిద్ధం'' అంటూ ఎమ్మెల్యే గాంధీ సవాల్ విసిరారు. అంతకుముందు రేపు ఉదయం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయనకు బీఆర్‌ఎస్ కండువా కప్పుతానని ఈ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
అలాగే గాంధీ ఇంటిపై గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. పార్టీ మారలేదన్న గాంధీని తెలంగాణ భవన్‌కు తీసుకెళ్తామన్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో గాంధీ ఇంటి వద్ద, కొండాపూర్‌లో కౌశిక్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరెకపూడి ఇంటికి వచ్చి బీఆర్‌ఎస్ కండువా కప్పుతానని కౌశిక్ వ్యాఖ్యానించగా, ఆయన రాకపోతే తానే వెళ్తానని గాంధీ అన్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.