10 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆమోదం..

Approval for implementation of 10% reservation. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By Medi Samrat  Published on  8 Feb 2021 12:46 PM GMT
Approval for implementation of 10% reservation

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు అమలు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్ణయించారు. విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఇవాళ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదటి నియామకాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

ఇందుకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాలకు అవసరమైన సవరణలను సాధారణ పరిపాలన, విద్యాశాఖలు విడిగా జారీ చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.


Next Story