హైదరాబాద్: వైద్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జీతం నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు ఉంటుందని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. మల్డీ జోన్ 1 లో 379, మల్టీ జోన్ 2లో 228 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 28, 29 తేదీల్లో దరఖాస్తులు సవరించుకోవచ్చు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ను విజిట్ చేయండి.
దరఖాస్తు రుసుం కింద రూ. 500 చెల్లించాలి. ఇదే కాకుండా ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 46 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తుదారులు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. వంద పాయింట్ల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. 80 పాయింట్లను అకడమిక్స్ లో సాధించిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. మరో 20 పాయింట్లను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేసిన వారికి వర్తింపజేస్తారు.