సీఎం కేసీఆర్‌పై ఏపీ బీజేపీ నేత విమ‌ర్శ‌లు

AP BJP Leader Vishnuvardhan Reddy Fires On CM KCR. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి సోష‌ల్ మీడియా

By Medi Samrat  Published on  19 Jun 2021 6:08 AM GMT
సీఎం కేసీఆర్‌పై ఏపీ బీజేపీ నేత విమ‌ర్శ‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. మల్లన్నసాగర్ నిర్వాసితుడికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇల్లు ఇస్తామ‌న్న అధికారులు.. ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడని ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ప్ర‌స్తావిస్తూ విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

'అయ్యా కేసీఆర్ గారు.. చివరకు తన చితి తాను పేర్చుకుని, కాల్చుకునే స్థితికి రైతులు చేరుకున్నారు.. మీరు చెప్పే బంగారు తెలంగాణలో మీ పాలనలో నేడు రైతుల దీనస్థితి' అంటూ విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ట్వీట్‌ను తెలంగాణ సీఎంవో, మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ అకౌంట్స్‌కు ట్యాగ్ చేశారు.

ఇదిలావుంటే.. తొగుట మండలం వేములగాట్‌కు చెందిన తుటుకూరి మల్లారెడ్డి( 70) భార్య చ‌నిపోవ‌డంతో ఒంట‌రిగా ఉంటున్నాడు. కూతురి కుమారుడు(మనవడు) అప్పుడప్పుడు తాత దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. కొద్ది నెల‌ల క్రితం అత‌డు ఉంటున్న ఇంటి స్థ‌లం మొత్తం మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టులో పోయింది. ఈ నేపథ్యంలో మృతుడు డబుల్‌ బెడ్‌ రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇంటిని మంజూరు చేసి ఒంటరి వాడన్న కారణంతో వెనక్కు తీసుకున్నారు. ఇంటిని ఖాళీ చేయించారన్న మనో వేదనతో గురువారం అర్థరాత్రి తను నివాసం ఉండే ఇంట్లో చితి పేర్చుకుని అందులో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.
Next Story
Share it