ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం.. ప్రణీత్‌రావు డీఎస్పీ హోదా రద్దు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్‌ రావును డిమోట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By -  అంజి
Published on : 4 Feb 2026 7:33 AM IST

phone tapping case, Telangana Government, demoting, DSP Praneeth Rao

ఫోన్‌ ట్యాపింగ్‌ కసులో సంచలనం.. ప్రణీత్‌రావు డీఎస్పీ హోదా రద్దు

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్‌ రావును డిమోట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీ నుంచి సీఐగా ప్రణీత్‌రావును డిమోట్‌ చేశారు. 2007 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ట్యాపింగ్‌ కేసులో అరెస్ట్‌ తర్వాత సస్పెండ్‌ అయ్యారు. డీఎస్పీని సీఐగా డిమోట్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.

దుగ్యాల ప్రణీత్‌ రావు డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం ప్రొబేషన్‌ కాలంలో విధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గతంలో ప్రణీత్‌రావుకు కల్పించిన యాక్సిలరేటెడ్‌ పదోన్నతి రద్దైంది. ఇకపై ఆయన సీఐగా కొనసాగుతారు.

2016లో ఎస్సై హోదాలో ప్రణీత్‌ రావు.. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. 2023 డిసెంబర్‌ వరకు అక్కడే పని చేశారు. ఆ సమయంలో యాక్సిలరేటెడ్‌ విధానంలో ప్రణీత్‌ రావు డీఎస్పీ అయ్యారు.

Next Story