హైదరాబాద్: కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కార్డులు మంజూరైన వారికి ఈ నెల 25 నుంచి మొబైల్స్‌కు మెసేజ్‌లు వస్తాయని పేర్కొంది. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్నబియ్యం ఇస్తామని వెల్లడించింది. గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేయనుంది. కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లకు చేరనుంది. వీరికి నెలకు 1.89 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.
ఇదిలా ఉంటే.. కొత్త రేషన్ కార్డు పొందినవాళ్లు లేదా పాత కార్డులో పేర్లు నమోదైన వారు.. వారి వివరాలను ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎఫ్ఎస్‌సీ సెర్చ్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డు సెర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే FSC సెర్చ్ అనే ఆప్షన్ డిస్ ప్లే అవుతుంది. దీనిపై క్లిక్ చేసి FSC Ref No నెంబర్ లేదా మీ రేషన్ కార్డు నెంబర్ ను ఎంట్రీ చేసి జిల్లాను ఎంచుకోవాలి. చివర్లో ఉండే సెర్చ్ పై క్లిక్ చేస్తే మీ కార్డు వివరాలు కింద కనిపిస్తాయి.