దారుణం..బాలుడిని చితకబాదిన అంగన్‌వాడీ టీచర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 11 Feb 2026 3:59 PM IST

దారుణం..బాలుడిని చితకబాదిన అంగన్‌వాడీ టీచర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్ ఓ బాలుడిని విచక్షణ రహితంగా చితకబాదిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో బాలుడి కన్నుకు తీవ్ర గాయం కాగా, శరీరంపై దెబ్బల గుర్తులు కనిపిస్తున్నాయి. బాలుడి పరిస్థితి చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం తల్లిదండ్రులు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి టీచర్‌పై ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి సదరు టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల భద్రతపై ఈ ఘటన పలు సందేహాలను రేకెత్తిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story