జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి చాపర్ ద్వారా బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగారు. అక్కడనుండి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టు ఆలయానికి చేయనున్నారు. టీటీడీ సహకారం తో 35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వసతి గదులు, మాల విరమణ మండపం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ను చూడడానికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.