రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలి: సీఎం రేవంత్‌

తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

By అంజి  Published on  17 July 2024 11:15 AM IST
farmer families, debt relief, CM Revanth, Telangana

రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలి: సీఎం రేవంత్‌

తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆషాడ మాసంలో పవిత్రమైన తొలి ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ప్రార్థించారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.

త్యాగ నిరతికి, అనిర్వచనీయ సహనానికి మొహరం ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ పేర్కొన్నారు. తరతరాలుగా తెలంగాణ గ్రామాల్లో హిందూ ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారని గుర్తు చేసుకున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజల మధ్య సఖ్యతకు, ఐక్యతకు వారధిగా మొహరం నిలుస్తుందని అన్నారు.

Next Story