మహబూబ్‌నగర్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్
జర్నలిస్టులకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
By అంజి Published on 9 July 2024 8:30 PM IST
మహబూబ్‌నగర్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్
జర్నలిస్టులకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లాలోని జర్నలిస్టుల ఇళ్ల సమస్యలను విన్న ఆయన.. అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు దండు దత్తేంద్ర ఆధ్వర్యంలో సభ్యులు ఎమ్మెల్యేతో సమావేశమై గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇల్లు పొందని జర్నలిస్టులందరికీ తప్పకుండా ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు..
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి డబుల్ బెడ్‌రూం ఇళ్లను తనకు అనుకూలంగా ఉన్న వారికే కేటాయించారని, సరైన మార్గదర్శకాలు పాటించలేదని జర్నలిస్టుల సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు తెలిపారు. నిజమైన, నిరుపేద జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని, తాము ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను రూపొందించామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మార్గదర్శకాలను పాటించే జర్నలిస్టులందరికీ ఖచ్చితంగా గృహనిర్మాణ ప్రయోజనాలు లభిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.