నేడే ఆఖరు.. రేషన్‌ కార్డు ఉన్నవారు ఇలా చేయండి

హైదరాబాద్‌: రేషన్‌ కార్డుల ఈ - కేవైసీ గడువు నేటితో ముగియనుంది. గత నెల 31నే ముగియాల్సి ఉండగా ఇవాళ్టి వరకు పొడిగించారు.

By అంజి  Published on  29 Feb 2024 1:58 AM GMT
Telangana,E KYC, ration cards

నేడే ఆఖరు.. రేషన్‌ కార్డు ఉన్నవారు ఇలా చేయండి

హైదరాబాద్‌: రేషన్‌ కార్డుల ఈ - కేవైసీ గడువు నేటితో ముగియనుంది. గత నెల 31నే ముగియాల్సి ఉండగా ఇవాళ్టి వరకు పొడిగించారు. రాష్ట్రంలో దాదాపు 20 శాతం మంది ఈ - కేవైసీ చేసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారరు. లబ్ధిదారులందరూ రేషన్‌ షాపులకు వెళ్లి ఈపోస్‌ యంత్రం ద్వారా వేలి ముద్రలు సమర్పించాలి. లేదంటే వచ్చే నెల నుంచి రేషన్‌ను నిలిపివేస్తారు. బోగస్ రేషన్‌ కార్డుల నిర్మూలన కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డు తప్పనిసరిగా మారింది.

ఈ కేవైసీ చేసుకోకపోతే వారి రేషన్ కార్డు కట్ అవుతుంది. చాలా మంది రేషన్ కార్డు కు వెలి ముద్ర అనుసంధానం చేసుకొని తెల్ల రేషన్ కార్డు దారులు ఎక్కువ ఉండటంతో పలు గ్రామాల్లో అధికారులు మైకుల్లో ప్రచారం చేశారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను కూడా త్వరలోనే ఇస్తామని ప్రకటించారు.

Next Story