టెన్త్‌ విద్యార్థులకు అలర్ట్‌.. పరీక్షల్లో కీలక మార్పులు, ఫీజు గడువు పెంపు

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్‌ పరీక్ష ఫీజు గుడువును డిసెంబర్‌ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు.

By అంజి  Published on  29 Nov 2024 1:55 AM GMT
Telangana, Tenth students, exams, fee deadline

టెన్త్‌ విద్యార్థులకు అలర్ట్‌.. పరీక్షల్లో కీలక మార్పులు, ఫీజు గడువు పెంపు 

హైదరాబాద్‌: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్‌ పరీక్ష ఫీజు గుడువును డిసెంబర్‌ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. ఎలాంటి ఫైన్‌ లేకుండా ఫీజు చెల్లింపునకు నిన్నటితో గడువు ముగియగా.. విద్యార్థులు, టీచర్ల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో డిసెంబర్‌ 12, రూ.200 ఫైన్‌తో 19 వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్‌ 30 వరకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లింపులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అటు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల విధానంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌రీక్ష విధానంలో స్వ‌ల్ప మార్పులు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేష‌న్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక‌పై 100 మార్కుల‌కు(ఒక్కో పేప‌ర్‌కు) ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. 2024-25 విద్యాసంవ‌త్స‌రం నుంచి ఈ విధానం అమ‌లు కానున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఇంట‌ర్న‌ల్ మార్కుల‌ను ఎత్తేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఇంట‌ర్న‌ల్ మార్కులు 20, వార్షిక ప‌రీక్ష‌ల మార్కులు 80గా ఉన్నాయి. ఇక‌పై విద్యార్థుల‌కు 24 పేజీల బుక్ లెట్ ఇవ్వాల‌ని పాఠశాల విద్యాశాఖ నిర్ణ‌యించింది.

అలాగే గ్రేడింగ్‌ విధానాన్ని కూడా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ1, ఏ2, బి1, బి2 గ్రేడులకు బదులు మార్కులను ప్రకటించనుంది. అలాగే ఆన్సర్‌ షీట్లలో కూడా మార్పులు చేసింది. 4 పేజీల బుక్‌ లెట్‌ + అడిషనల్‌ పేపర్లకు బదులు 24 పేజీల ఆన్సర్‌ బుక్‌ లెట్లను ఇవ్వనుంది. సైన్స్‌ పేపర్లకు ఒక్కో దానికి 12 పేజీల ఆన్సర్‌ బుక్‌ లెట్‌ ఇవ్వాలని నిర్ణయించింది.

Next Story