Telangana: గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌

తెలంగాణలో గ్రూప్‌-2 ఎగ్జామ్స్‌ డిసెంబర్‌ 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఎగ్జామ్స్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

By అంజి  Published on  6 Dec 2024 1:30 PM IST
Telangana, Group-2 candidates, Group-2 Exam

Telangana: గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌

తెలంగాణలో గ్రూప్‌-2 ఎగ్జామ్స్‌ డిసెంబర్‌ 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఎగ్జామ్స్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం 4 పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 1,3, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2, పేపర్‌ 4 పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 9వ తేదీ నుంచి హాల్‌ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. మొత్తం 783 గ్రూప్‌ - 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. 5.57 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎగ్జామ్స్‌కు 10 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం ఉన్న సమయంలో ఇప్పటి వరకు చదివిన సిలబస్‌ను రివిజన్‌ చేసుకోండి. కొత్త సిలబస్‌ జోలికి వెళ్లకండి. ప్రాక్టీస్‌ పేపర్స్‌ సాధన చేయడం ద్వారా ఎగ్జామ్స్‌లో తప్పులు చేయకుండా ఉండవచ్చు. టైమ్‌ మేనెజ్‌మెంట్‌ చాలా ముఖ్యం.

Next Story