5 సంవత్సరాల తర్వాత, పునరుద్ధరించబడిన యాదిగిరిగుట్ట ఆలయం.. మెరుగైన సౌకర్యాలతో
After 5 years renovated Yadigirgutta Temple set to reopen on 28 march with new improved facilities.యాదిగిరిగుట్టఆలయాన్ని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 March 2022 9:30 AM ISTయాదిగిరిగుట్ట ఆలయాన్ని ఐదేళ్ల తర్వాత మార్చి 28న తెరిచారు. తెలంగాణలోని ప్రముఖ కొండ పుణ్యక్షేత్రం ఇప్పుడు కేవలం గుహ క్షేత్రం మాత్రమే కాదు. ఇది ఇప్పుడు ఏడు గోపురాలతో 17 ఎకరాల విస్తీర్ణంలో మూడంతస్తుల ఆలయం. 1,000 సంవత్సరాల పురాతన మందిరం చుట్టూ కొత్త ఆలయం నిర్మించబడింది. ఆలయ పునరుద్ధరణ అనేది యాత్రికులకు వివిధ సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో చేయబడింది. QR కోడ్ టిక్కెట్‌ల నుండి ప్రజలకు ఉచిత ప్రయాణ సేవలు, పలు క్యూ లైన్‌లు మరెన్నో కొత్త ఆలయంలో రూపొందించారు. ఈ ఆలయం సరికొత్త రూపాన్ని కలిగి ఉంది. యాత్రికులు కోసం అనేక కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ఆలయాన్ని ఎలా నిర్మించారు..?
శిల్పాలను చెక్కడానికి కృష్ణశిల శిలలను ఉపయోగించారు. 2.5 లక్షల టన్నుల బరువున్న రాళ్లను ఏళ్ల తరబడి యాదిగిరిగుట్టకు తరలించారు. గుడి కట్టడానికి ఒక్క బస్తా సిమెంట్ మూటను కూడా ఉపయోగించలేదు. సిమెంటుకు బదులు సున్నం వాడారు. ఆలయ నిర్మాణానికి సంప్రదాయ నిర్మాణ పద్ధతులను ఉపయోగించారు. ఆలయ ప్రధాన వాస్తుశిల్పి ఆనంద్ సాయి దక్షిణ భారతదేశంలోని అనేక దేవాలయాలను సందర్శించి, యాదగిరిగుట్ట కోసం వాటి నుండి ప్రేరణ పొందారు.
"పాత ఆలయాన్ని ఏ మాత్రం తాకలేదు. స్వయంభూ (అసలు ఆలయ మైదానం), గర్భగుడి (ప్రధాన ఆలయం) అలాగే ఉన్నాయి" అని ఆయన చెప్పారు. పాత గుడిని అసలు తాకలేదు.. దాని చుట్టూ కొత్త ఆలయాన్ని నిర్మించారు. తాను ద్రావిడ వాస్తుశిల్పం నుండి ప్రేరణ పొందానని ఆనంద్ వివరించాడు, చాలా మంది పాత మధురై ఆలయంలా ఉన్నట్లు భావిస్తారని చెప్పాడు. "తిరుచిరాపల్లిలోని శ్రీరంగం దేవాలయం నుండి ఏడు గోపురాలనే అంశం ప్రేరణ పొందాము" అని ఆయన చెప్పారు.
విమాన గోపురం (ఆలయం లోపల ప్రధాన గోపురం) సుమారు 12 కిలోల బరువున్న బంగారంతో కప్పబడి ఉంది. అది దాదాపు 56 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రేరణ పొందింది. ఆలయ విస్తరణకు మొత్తం 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విమాన గోపురాన్ని బంగారంతో కప్పాలని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్ ఇందుకోసం పలువురు భక్తుల నుంచి విరాళాలు కోరారు. రాజగోపురం (ఆలయ ద్వారం వద్ద ఉన్న నిర్మాణం) ఏడు అంతస్తుల ఎత్తు, 13,000 టన్నుల బరువున్న రాళ్లతో నిర్మించబడింది.
క్యూ లైన్లు-లైట్లు:
వాస్తు మరియు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా, ఆలయానికి సంబంధించి విశాలమైన ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. "యాదగిరిగుట్ట చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇంతకు ముందు ఆలయ విస్తీర్ణం చాలా తక్కువగా ఉండేది. ఆలయ అభివృద్ధి ప్రారంభమైనప్పుడు, యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఆనంద్ వివరించారు. "మేము ఆలయ విస్తీర్ణాన్ని పెంచడమే కాదు, ప్రజలకు దైవిక అనుభూతిని అందించే విధంగా క్యూ లైన్లను రూపొందించాము" అని ఆయన చెప్పారు.
ఈ ఆలయంలోని మరొక అద్భుతం.. దాని లైటింగ్ "ఆలయం చుట్టూ వేల సంఖ్యలో బల్బులు అమర్చబడ్డాయి. సూర్యాస్తమయం తరువాత, ఆలయం మొత్తం వెలిగిపోతుంది. లైటింగ్ కారణంగా ఆలయం మూడు-నాలుగు కిలోమీటర్ల దూరం వరకు కనిపించేలా చేస్తుంది" అని ఆనంద్ వివరించారు.
మరిన్ని లడ్డూలు.. తక్కువ లైన్లు:
వైటీడీఏ వైస్ చైర్మెన్ జి. కిషన్‌రావు న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ.. "ప్రసాదాల సేకరణకు పెద్ద ఎత్తున బారులు తీరి ఉండడం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రసాదాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పొడవైన లైన్లు ఏర్పాటు చేశాం. ఏప్రిల్ నుండి, మేము లడ్డూలను తయారు చేయడానికి మెకనైజ్డ్ మెషినరీని వాడుతాం." అని అన్నారు. యాదాద్రిగుట్టలో లడ్డూలను చేతితో తయారు చేశారని, అయితే ఇప్పుడు ఆలయ అధికారులు తీసుకొచ్చిన ముడిసరుకుతో అన్ని లడ్డూలను ఒక యంత్రం రోల్ చేస్తుందని శ్రీ కిషన్ రావు వివరించారు. యంత్రాలను ఉపయోగించి ఒకేసారి 50,000 లడ్డూలను ఉత్పత్తి చేయగలుగుతామని ఆయన చెప్పారు. దీని వల్ల లడ్డూల నాణ్యత లేదా పరిమాణంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన హామీ ఇచ్చారు. కొండపైన దాదాపు 20 టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సుదూరమైన లైన్లను తగ్గించి రెండు నిమిషాల్లో టిక్కెట్లు జారీ చేయడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అన్ని టిక్కెట్లు క్యూఆర్ కోడ్‌లతో ప్రారంభించబడతాయని కిషన్ రావు అన్నారు.
ప్రతి గంటకు టిక్కెట్లు జారీ చేయబడతాయి. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) QR-కోడెడ్ టిక్కెట్ల నిర్వహణను చూసుకుంటుంది. భక్తులు క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించిన తర్వాత గంటలోపు వారి దర్శనం పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. వైటీడీఏ బస్ స్టేషన్ నుండి కొండపైకి ఉచిత షటిల్ సేవలను కూడా అందిస్తుంది. ఆలయాన్ని సందర్శించే యాత్రికులందరూ రోజంతా నిత్య అన్నదానంలో భోజనం చేయవచ్చు.
భద్రత, సౌకర్యాలు
యాదిగిరిగుట్ట, ఆలయ పరిసర ప్రాంతాలు రెండూ సురక్షితంగా ఉండేలా చూసేందుకు, ఆలయం అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాయగిరి సరస్సు వంతెనపై కూడా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. "ఇంతకుముందు, ఆలయ పరిసరాల్లో లిఫ్టులు లేదా ఎస్కలేటర్లు లేవు. ఇప్పుడు, ఆలయంలో రెండు లిఫ్టులు, ఎస్కలేటర్లు ఉన్నాయి, వీటిని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. ఇది సీనియర్ సిటిజన్లు, శారీరక వికలాంగులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది" అని కిషన్ రావు అన్నారు.
యాత్రికులకు వసతి
ప్రస్తుతం యాదాద్రిలో దాదాపు 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని కిషన్‌రావు తెలిపారు. "ఆలయం చుట్టూ రియల్ ఎస్టేట్ కూడా అభివృద్ధి చెందుతోంది. ఆలయ ప్రక్కనే ఉన్న కొండలపై అనేక ప్రెసిడెన్షియల్ సూట్లు, గెస్ట్ హౌస్‌లు కూడా నిర్మించబడ్డాయి," అన్నారాయన.