మంత్రి కేటీఆర్‌, న‌టుడు సోనూసూద్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

Actor Sonusood praises on minister ktr.ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, బాలీవుడ్ న‌టుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2021 1:21 PM IST
మంత్రి కేటీఆర్‌, న‌టుడు సోనూసూద్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, బాలీవుడ్ న‌టుడు న‌టుడు సోనూసూద్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. ఇటీవ‌ల సాయం అందుకున్న ఓ వ్య‌క్తి మంత్రి కేటీఆర్‌ను సూప‌ర్ హీరో అని పొగ‌డ‌గా.. అందుకు సోనూసూద్ అర్హుడు అంటూ కేటీఆర్ బదులిచ్చారు. ఈ ట్వీట్‌పై స్పందించిన సోనూసూద్.. కేటీఆరే నిజ‌మైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంద‌ని పేర్కొన్నారు.

క‌రోనా క‌ష్ట‌కాలంలో సాయం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్‌లో ప్ర‌జ‌ల నుంచి విజ్ఞ‌ప్తులు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. వాటిలో త‌న‌కు వీలైనంత వ‌ర‌కు సాయం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ వ‌ల్ల తనకు దక్కిన సాయానికి కృతజ్ఞతగా నంద కిశోర్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఆక్సిజన్ కాన్స‌న్‌ట్రేట‌ర్ల‌ను తాను అడ‌గ‌గా కేటీఆర్ అందేలా చేశార‌ని ఆయ‌న చెప్పాడు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ నుంచి అందుతున్న సాయం మరువలేనిదని చెప్పుకొచ్చాడు. కేటీఆర్‌ను సూపర్ హీరో అని పొగిడాడు.

ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన నాయ‌కుడిని, త‌న‌కు చేత‌నైనంతా స‌హాయం చేస్తున్నాను. సూప‌ర్ హీరో తాను కాదు. సూప‌ర్ హీరో అని మీరు సోనూసూద్‌ను పిలవ‌చ్చు అని కేటీఆర్ రీట్వీట్ చేశారు.

'థ్యాంక్​ యూ సో మచ్​ సర్. కానీ, తెలంగాణకు మీరు ఎంతో చేస్తున్నారు. కాబట్టి మీరే రియల్​ హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ నాకు మరో ఇంటిలాంటిది. ఏళ్లుగా ఇక్కడి జనాలు నా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు అని సోనూసూద్​ రీ ట్వీట్​ చేశారు.

ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. సోనూసూద్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మీరు చేస్తున్న ప‌ని చాలా గొప్ప‌ది. మీరు కోట్లాది మందికి ఆద‌ర్శ‌మ‌ని కేటీఆర్ రీట్వీట్ చేశారు.

Next Story